పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ ఇదేనా?

  • ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న 'వకీల్ సాబ్'
  • పవన్, రానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం
  • క్రిష్ చిత్రానికి 'హరిహర వీరమల్లు' టైటిల్ 
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. 'వకీల్ సాబ్' చిత్రంతో పవన్ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. ఏప్రిల్ 9న ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియమ్'కు రీమేక్ గా ఇది తెరకెక్కుతోంది.

ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో పవన్ తన 27వ చిత్రాన్ని చేయబోతున్నారు. దీనికి పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 'హరిహర వీరమల్లు' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు ఫిలింనగర్ టాక్. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.  


More Telugu News