రెండున్నరేళ్లుగా బాబు డైరెక్షన్ ఇవ్వలేదని నిమ్మగడ్డ నిద్రపోయాడు: విజయసాయి రెడ్డి
- స్థానిక ఎన్నికలు జరపాలని 2018లోనే హైకోర్టు ఆదేశం
- నిమ్మగడ్డ పట్టించుకోలేదు
- ఇప్పుడు కరోనా టైంలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తోన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై వైసీపీ నేతలు విమర్శల జల్లు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిమ్మగడ్డపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు.
'స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని 2018లోనే హైకోర్టు ఆదేశించినా నిమ్మగడ్డ పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఆఖరిసారి ఎన్నికలు జరిగాయి. రెండున్నరేళ్లుగా బాబు డైరెక్షన్ ఇవ్వలేదని నిమగడ్డ నిద్రపోయాడు. ఇప్పుడు కరోనా టైంలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు' అని విజయసాయిరెడ్డి విమర్శించారు.
దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. 'రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పినా, సుప్రీంకోర్టు తగిన ఆదేశాలిచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డ రమేశ్‌పై దాడిని కొనసాగిస్తూనే ఉంది. నిమ్మగడ్డ, గతం మరచి, అందరం ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిద్దామని విజ్ఞప్తి చేసినా, ఆయనపై ప్రభుత్వ దాడి ఆగలేదు. ఇది, రాజ్యాంగ సంక్షోభమే. ఎటు దారితీస్తుందో చూద్దాం' అని వర్ల రామయ్య అన్నారు.