రామాలయ నిర్మాణానికి కోట్లాది రూపాయల విరాళం ఇచ్చిన మైహోమ్, మేఘా ఇన్ఫ్రా!

  • జూపల్లి రామేశ్వరరావు రూ. 5 కోట్లు
  • మేఘా ఇంజినీరింగ్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి రూ. 6 కోట్లు
  • అపర్ణ కన్స్ స్ట్రక్షన్స్ రూ. 2 కోట్లు
అయోధ్య రామాలయ నిర్మాణానికి భారీ ఎత్తున విరాళాలు అందుతున్నాయి. తెలంగాణలో విరాళాల సేకరణ ప్రారంభమైన ఈరోజే దాతల నుంచి కోట్లాది రూపాయల విరాళాలు అందాయి. మైహోమ్ గ్రూప్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు రూ. 5 కోట్లు, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి రూ. 6 కోట్లు ఇచ్చారు. అపర్ణ కన్స్ స్ట్రక్షన్స్ తరపున రూ. 2 కోట్లు రాగా... డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ కోటి రూపాయలు ఇచ్చింది.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ముచ్చింతల్ లో ఉన్న త్రిదండి చినజీయర్ స్వామి సమక్షంలో మైహోమ్ గ్రూప్ డైరెక్టర్లు జూపల్లి రామ్ రావు, జూపల్లి శ్యామ్ రావు విరాళాన్ని ఇచ్చారు. ఆరెస్సెస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషి, ఆరెస్సెస్ నేత భాగయ్యకు చెక్కుల రూపంలో విరాళాలను అందజేశారు. ఫిబ్రవరి 27 వరకు విరాళాల సేకరణ కొనసాగనుంది. దేశ వ్యాప్తంగా ఐదు లక్షల గ్రామాల్లోని కోటి ఇళ్ల నుంచి విరాళాలను సేకరించనున్నట్టు రామ జన్మభూమి ట్రస్టు ప్రకటించింది.


More Telugu News