తెలుగునాట రామరాజ్యాన్ని తిరిగి నెలకొల్పాలి.. అదే ఎన్టీఆర్‌కు అసలైన నివాళి: చ‌ంద్ర‌బాబు

  • రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చారు
  • కోట్లాది జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు ఎన్టీఆర్
  • సంక్షేమ పాలనకు ఆద్యుడు  
  • ఆ విశ్వవిఖ్యాతుడు మన కళ్ల‌ముందే కదలాడుతున్నట్టు ఉంది
ఎన్టీఆర్‌ 25వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద టీడీపీ అధినేత‌ చంద్రబాబు, ఆ పార్టీ నేత‌లు నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్‌ను కొనియాడారు. 'రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చి, కోట్లాది జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. బడుగు బలహీనవర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది ఎన్టీఆర్. పేదలకు ఆహారభద్రత, నివాస భద్రత, కట్టుకోడానికి మంచి వస్త్రం అందించిన సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్'  అని చంద్ర‌బాబు అన్నారు.

'తెలుగువారి ఆత్మగౌరవాన్ని, కీర్తిని ప్రపంచానికి చాటిన స్వర్గీయ నందమూరి తారకరామారావు మనకు దూరమై 25 సంవత్సరాలు అయినా ఆ విశ్వవిఖ్యాతుడు మన కళ్ల‌ముందే కదలాడుతున్నట్టు ఉంది. తెలుగునాట రామరాజ్యాన్ని తిరిగి నెలకొల్పడమే ఎన్టీఆర్ కు మనం అందించే అసలైన నివాళి' అంటూ చంద్ర‌బాబు నాయుడు ట్వీట్ చేశారు.




More Telugu News