అమెరికా నుంచి వచ్చిన పావురాన్ని చంపేందుకు ప్రయత్నిస్తున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం!
- 13 వేల కిలోమీటర్లు దాటి వచ్చిన పావురం
- అక్టోబరు 29న అమెరికాలో అదృశ్యం
- డిసెంబరు 26న ఆస్ట్రేలియాలో ప్రత్యక్షం
- విదేశీ పక్షి ద్వారా వ్యాధులు వస్తాయని ఆస్ట్రేలియా ఆందోళన
ఇటీవల ఓ పందెం పావురం అమెరికా నుంచి ఆస్ట్రేలియా చేరుకుంది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా 13 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆస్ట్రేలియా వచ్చిన ఈ పావురం, మెల్బోర్న్ లోని కెవిన్ సెల్లి-బర్డ్ అనే వ్యక్తి ఇంటి పెరట్లో వాలింది. డిసెంబరు 26న బాగా అలసిపోయిన స్థితిలో ఉన్న ఆ పావురాన్ని గుర్తించిన సెల్లి-బర్డ్ ఆహారం అందించే ప్రయత్నం చేశాడు.
సహజంగా కనిపించే అడవి పావురాలకు భిన్నంగా కాలికి రబ్బరు బ్యాండ్ తో ఎంతో అందంగా కనిపిస్తున్న ఆ పందెం పావురాన్ని ఆస్ట్రేలియన్లు సులభంగానే గుర్తించారు. అది విదేశీ పక్షి అని, దాని కారణంగా ఆస్ట్రేలియాలో ప్రమాదకర వైరస్ లు వ్యాపించే అవకాశం ఉందని ఆస్ట్రేలియా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని చంపేయడమే శ్రేయస్కరం అని తీర్మానించారు.
కాగా, అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో గత అక్టోబరులో నిర్వహించిన పావురాల పందెం నుంచి ఓ పావురం ఆచూకీ లేకుండా పోయిందని వెల్లడైంది. ఇప్పుడా పావురమే సముద్ర మార్గంలో ఒక సరకు రవాణా ఓడపై వాలి ఇంతదూరం ప్రయాణించి ఆస్ట్రేలియా వచ్చినట్టు భావిస్తున్నారు.
మెల్బోర్న్ వాసి సెల్లి-బర్డ్ ఆ పావురానికి అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ పేరులోని జో అనే పదాన్ని తీసి, దానికి నామకరణం చేశాడు. ప్రమాదకర వైరస్ లను వ్యాప్తి చేస్తుందన్న కారణంతో అధికారులు ఆ పక్షిని పట్టుకోవాలంటూ సెల్లి-బర్డ్ కు సూచించారు. అయితే ఆ పావురాన్ని తాను పట్టుకోలేనని, దగ్గరికి వెళ్లేసరికి అది చటుక్కున ఎగిరిపోతోందని అతడు నిస్సహాయత వ్యక్తం చేశాడు. పైగా చంపేందుకు పావురాన్ని పట్టుకోవాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నాడు.
దీనిపై ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ వర్గాలు స్పందిస్తూ, ఆ పావురాన్ని ఆస్ట్రేలియాలో ఉండేందుకు అంగీకరించలేమని, దాని కారణంగా దేశ ఆహార భద్రత, అటవీ పక్షిజాతుల జనాభా ప్రభావితమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా, దేశ పౌల్ట్రీ పరిశ్రమకు, ఇక్కడి పక్షిజాతుల ఆరోగ్యానికి ప్రత్యక్ష ముప్పుగా పరిణమించిందని వివరించింది.
ఆస్ట్రేలియాలో చట్టాలు ఎంతో కఠినంగా ఉంటాయి. 2015లో హాలీవుడ్ స్టార్లు జానీ డెప్, అతడి మాజీ భార్య ఆంబర్ హార్డ్ రెండు కుక్క పిల్లలతో సహా ఆస్ట్రేలియా వచ్చారు. అయితే, ఆ కుక్క పిల్లలను చంపేయమంటారా లేక, 50 గంటల్లో దేశం విడిచివెళ్లపోతారా అంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆల్టిమేటం జారీ చేసింది. దాంతో చేసేదిలేక జానీ డెప్, ఆంబర్ హార్డ్ ప్రత్యేక విమానంలో ఆ కుక్క పిల్లలను తరలించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై తిరుగాడుతున్న జో అనే పావురాన్ని పట్టుకోవడంపై స్థానిక యంత్రాంగం దృష్టి సారించింది. పక్షులు పట్టే నిపుణుల కోసం ప్రకటన చేసింది.