బీజేపీకి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సాయం: ఎంపీ సాక్షి మహారాజ్
- ఎంఐఎం వల్లే బీజేపీ బీహార్‌లో పుంజుకుంది
- ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లోనూ ఒవైసీ పార్టీ పోటీ
- అక్కడ కూడా గెలుస్తాం
బీజేపీకి ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పరోక్షంగా సాయం చేస్తున్నారంటూ యూపీలోని ఉన్నావో ఎంపీ సాక్షి మహారాజ్ ఒప్పుకున్నారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ఆయన తాజాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడారు. ఎంఐఎం వల్లే బీజేపీ బీహార్‌లో ఓట్లు చీల్చి అత్యధిక స్థానాలు గెలుపొందిందని తెలిపారు.
ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ ఒవైసీ పార్టీ పోటీ చేస్తుందని, అక్కడ కూడా తమ పార్టీ బీజేపీ గెలుపునకు ఒవైసీ సాయం చేయబోతున్నారని చెప్పారు. కాగా, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి ఎంఐఎం సిద్ధమవుతోంది. ఎంఐఎం పోటీ చేసి ఓట్లు చీల్చుతూ బీజేపీకి పరోక్షంగా సహకరిస్తోందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ లో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడ పోటీ చేయనున్న అన్ని పార్టీలు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి.