తిరుమలలో తగ్గిన రద్దీ!
- మొదలైన సంక్రాంతి పర్వదినాలు
- నిన్న దాదాపు 23 వేల మందికి దర్శనం
- వారాంతంలో రద్దీ పెరిగే అవకాశం
సంక్రాంతి పర్వదినాలు మొదలు కావడంతో తిరుమలలో రద్దీ భారీగా తగ్గింది. పండగ సీజన్ లో స్వస్థలాల్లో ఉండేందుకే అత్యధికులు మొగ్గుచూపుతూ, గ్రామాలకు చేరుకున్న వేళ, భక్తుల రద్దీ కనిపించలేదు.
ఈ క్రమంలో నిన్న స్వామివారిని సుమారు 23 వేల మంది దర్శించుకోగా, హుండీ ద్వారా రూ. 2 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఈ మూడు రోజులూ రద్దీ సాధారణం కన్నా తక్కువగానే ఉంటుందని, ఆపై వారాంతంలో రద్దీ భారీగా పెరగవచ్చని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో మకర సంక్రమణం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. తిరుమలను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు.