ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తొలివిడతలోనే కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి.... ప్రధానికి లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

  • ఈ నెల 16 నుంచి దేశంలో టీకాల పంపిణీ!
  • తొలి విడతలో 3 కోట్ల మందికి డోసులు
  • ముందువరుస యోధులకు తొలి విడతలో వ్యాక్సిన్
  • ప్రజాప్రతినిధులకు కూడా వారితోపాటు ఇచ్చేయాలన్న రఘురామ
దేశంలో మరికొన్నిరోజుల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తొలివిడతలోనే కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముందువరుస యోధులతో పాటే ప్రజాప్రతినిధులకు కూడా వ్యాక్సిన్ అందజేయాలని కోరారు.

భారత్ లో ఈ నెల 16 నుంచి కరోనా టీకా అందించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో తొలి విడతలో నాలుగు వ్యాక్సిన్ స్టోరేజి కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి దేశం మొత్తానికి వ్యాక్సిన్ సరఫరా చేస్తారు. ముంబయి, కోల్ కతా, చెన్నై, కర్నాల్ ప్రాంతాల్లో ఈ స్టోరేజి కేంద్రాలు నెలకొల్పనున్నారు. తదనంతర దశలో దేశవ్యాప్తంగా 37 స్టోరేజి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

కాగా, తొలి విడత వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 3 కోట్ల మందిమందికి వ్యాక్సిన్ డోసులు ఇవ్వనున్నారు. వారిలో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్యకార్మికులే అత్యధికంగా ఉంటారు. భారత్ లో ఇటీవల కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లకు డీసీజీఐ అత్యవసర అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.


More Telugu News