దేశాన్ని గర్వపడేలా చేస్తుంది: రెండు కరోనా వ్యాక్సిన్లకు అనుమతులపై మోదీ స్పందన!
- మేడిన్ ఇండియా వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి అనుమతులు
- ఆత్మనిర్భర్ భారత్ కలను నిజం చేసేలా కృషి
- కరోనా నేపథ్యంలో కీలక ముందడుగు
భారత్ లో కొవాగ్జిన్ తో పాటు కొవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. మేడిన్ ఇండియా వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి అనుమతులు డీసీజీఐ తీసుకున్న నిర్ణయం భారతీయులను గర్వించేలా చేస్తుందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ కలను నిజం చేసేలా మన శాస్త్రవేత్తలు, సమాజం ఎంతగా ఆత్రుతగా ఉందో ఇది తెలుపుతోందని అన్నారు.
దేశంలో కరోనా నేపథ్యంలో కీలక ముందడుగు పడిందని చెప్పారు. కరోనా నేపథ్యంలో పోరాడిన వైద్యులు, వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు కరోనా వారియర్లందరికీ మరోసారి కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు. దేశంలో కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడారని చెప్పారు. డీసీజీఐ అనుమతులు ఇచ్చిన ఈ రెండు టీకాలు భారత్ ను కరోనా రహిత దేశంగా మార్చేందుకు తోడ్పడుతాయని చెప్పారు.