నారా లోకేశ్ కు విజయసాయిరెడ్డి సవాల్

  • లోకేశ్ సవాల్ విసిరినట్టుగా నేను అప్పన్న సన్నిధికి వస్తా
  • చర్చ ఎప్పుడో తేదీ, సమయం లోకేశ్ చెప్పాలి
  • కుట్రలకు, చంద్రబాబుకు విడదీయరాని బంధం ఉంది
విజయనగరం జిల్లాలోని రామతీర్థం రణరంగాన్ని తలపిస్తోంది. రామతీర్థాన్ని సందర్శించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అక్కడి నుంచి తిరిగి వస్తుండగా చేదు అనుభవం ఎదురైంది. ఆయనపైకి బీజేపీ, టీడీపీ కార్యకర్తలు  చెప్పులు, రాళ్లు విసిరారు. అనంతరం, ఆయన వేరే వాహనంలో అక్కడి నుంచి బయల్దేరారు. రామతీర్థం నుంచి కొంత దూరం వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

టీడీపీ నేత నారా లోకేశ్ సవాల్ విసిరినట్టుగా తాను అప్పన్న సన్నిధికి వస్తానని విజయసాయి ఈ సందర్భంగా చెప్పారు. తాను చర్చకు సిద్ధమని... చర్చ ఎప్పుడో తేదీ, సమయం లోకేశ్ చెప్పాలని సవాల్ విసిరారు. కుట్ర రాజకీయాలకు, చంద్రబాబుకు విడదీయరాని బంధం ఉందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ మంచి జరిగినా తన వల్లే అని చంద్రబాబు అంటారని... చెడు జరిగితే మాత్రం ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కుటుంబ సభ్యులను కూడా చంద్రబాబు మోసం చేశారని అన్నారు. రామతీర్థం ఘటన శోచనీయమని చెప్పారు. ఈ ఆలయానికి టీడీపీ నేత అశోక్ గజపతిరాజు ట్రస్టీగా ఉన్నారని అన్నారు.


More Telugu News