వరంగల్ సీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

  • లొంగిపోయిన నరేందర్, దేవి దంపతులు
  • యాక్షన్ టీమ్ కమాండర్ గా పని చేసిన నరేందర్
  • బాంబ్ బ్లాస్టింగుల్లో ఎక్స్ పర్ట్
తెలంగాణ పోలీసులు మరో విజయాన్ని సాధించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎదుట మావోయిస్టు దంపతులు నరేందర్ అలియాస్ సంపత్, పొడియం దేవి లొంగిపోయారు. యాలం నరేందర్ ములుగు జిల్లా వెంకటాపురం ఏరియా కమాండర్ గా, యాక్షన్ టీమ్ కమాండర్ గా పని చేశారు. పొడియం దేవి దళ సభ్యురాలిగా పని చేశారు. నరేందర్ ది చత్తీస్ గఢ్ కాగా, దేవిది ములుగు జిల్లా వాజేడు. నరేందర్ 2005 నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో ఉన్నారు. ఈయనపై ఇప్పటికే 6కి పైగా కేసులు ఉన్నాయి. బాంబ్ బ్లాస్టింగుల్లో ఈయన ఎక్స్ పర్ట్. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, నరేందర్ కు రూ. 4 లక్షలు, దేవికి రూ. 1 లక్ష రివార్డును ఈరోజు అందించామని తెలిపారు.


More Telugu News