సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • న్యూ ఇయర్ రోజున 'క్రాక్' ట్రయిలర్ 
  • కమలహాసన్ సినిమాలో ప్రభుదేవా 
  • హీరోగా మారిన కొరియోగ్రాఫర్  
*  రవితేజ, శ్రుతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న 'క్రాక్' చిత్రానికి సంబంధించిన ట్రయిలర్ ను జనవరి 1న విడుదల చేస్తున్నారు. కాగా, చిత్రాన్ని జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేస్తారు.
*  ప్రముఖ నటుడు కమలహాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'విక్రమ్' పేరిట ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో ఓ కీలక పాత్రకు గాను తాజాగా ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రభుదేవాను తీసుకున్నట్టు సమాచారం. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమలహాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
*  ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా హీరోగా మారాడు. మురళీరాజ్ తియ్యాన దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో జానీ మాస్టర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులో మొదలైంది. ఇందులో దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తోంది.


More Telugu News