రష్యాలో స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ అత్యవసర‌ వినియోగానికి అనుమతులు

  • ముందుగా  60 ఏళ్లు పైబడినవారికి వేసేందుకు అనుమతి
  • ప్రయోగ పరీక్షల్లో ఫలితాలు సానుకూలం
  • అనేక దేశాలతోనూ ఒప్పందాలు చేసుకున్నామని రష్యా ప్రకటన
రష్యాలో అత్యవసర వినియోగం కింద స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ వినియోగానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముందుగా  60 ఏళ్లు పైబడిన వారికి వేసేందుకు ఆమోద ముద్ర పడింది. రష్యాలో ఇప్పటికే దాదాపు 2 లక్షల మందికి పైగా వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. 60 ఏళ్లకు పై బడిన వారిపై స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను రష్యా పరీక్షించింది.

ప్రయోగ పరీక్షల్లో ఫలితాలు సానుకూలంగా రావడంతో స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌కు అనుమతి ఇస్తున్నట్లు రష్యా ప్రకటించింది. తమ వ్యాక్సిన్ ఎగుమతులకు ఇప్పటికే తాము అనేక దేశాలతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపింది. మరోవైపు, స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ వినియోగానికి ఇప్పటికే అర్జంటీనా, బెలారస్ దేశాలు అనుమతులు ఇచ్చాయి. స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ మెరుగైన ఫలితాలను ఇస్తోందని కొన్ని నెలల ముందే రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే.


More Telugu News