బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న రష్మిక మందన్న

  • తెలుగులో దూసుకుపోతున్న రష్మిక
  • మిషన్ మజ్ను చిత్రంతో బాలీవుడ్ ప్రవేశం
  • సిద్ధార్థ్ మల్హోత్రా సరసన హీరోయిన్ గా ఎంపిక
  • ఛలో, గీత గోవిందం చిత్రాలతో గుర్తింపు
ఛలో, గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న కన్నడ భామ రష్మిక మందన్న ఇప్పుడు బాలీవుడ్ లో ప్రవేశిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధానపాత్ర పోషిస్తున్న మిషన్ మజ్నులో కథానాయికగా ఎంపికైంది. ఓ కోవర్ట్ ఆపరేషన్ కథాంశంతో తెరకెక్కుతున్న మిషన్ మజ్ను చిత్రానికి శంతను బాగ్చి దర్శకత్వం వహిస్తున్నాడు.

కాగా, ఇటీవల కాలంలో వరుసగా హిట్లు పడడంతో ఈ స్లిమ్ బ్యూటీ తెలుగులోనూ జోరుగా అవకాశాలు అందుకుంటోంది. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలోనూ రష్మికనే హీరోయిన్. ఇదే కాకుండా పొగరు, ఆడాళ్లూ మీకు జోహార్లు వంటి చిత్రాల్లోనూ నటిస్తోంది.


More Telugu News