తెలంగాణలో కొత్త మండలం ఏర్పాటు
- మెదక్ జిల్లాలో కొన్ని గ్రామాలతో కొత్త మండలం
- 9 గ్రామాలతో మాసాయిపేట మండలం
- సీఎం కేసీఆర్ కు నర్సాపూర్ ఎమ్మెల్యే వినతి
- ఆమోదం తెలిపిన సీఎం
- త్వరలోనే ఉత్తర్వులు
తెలంగాణలో ఓ కొత్త మండలం ఏర్పాటు చేస్తున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్ లో కొన్ని గ్రామాలను కలిపి మూసాయిపేట మండలంగా ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. కొత్త మండలం ఏర్పాటు చేయాలన్న నర్సాపూర్ శాసనసభ్యుడు చిలుముల మదన్ రెడ్డి వినతిని పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. కొత్తగా ఏర్పడే మాసాయిపేట మండలంలో మొత్తం 9 గ్రామాలు ఉంటాయి. చేగుంట మండలంలోని 3 గ్రామాలు, ఎల్దుర్తి మండలంలోని 6 గ్రామాలతో మాసాయిపేట మండలం రూపుదిద్దుకోనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి.