నేపాల్‌లో కీలక పరిణామం.. పార్లమెంటును రద్దు చేయాలని మంత్రి మండలి నిర్ణయం

  • ప్రధాని కేపీ శర్మ ఓలి నిర్వహించిన అత్యవసర సమావేశంలోనే నిర్ణయం
  • రాష్ట్రపతికి సిఫారసు పంపిన నేపాల్ మంత్రివర్గం
  • ప్రకటన చేసిన నేపాల్ మంత్రి బార్సామన్ పున్  
నేపాల్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేపాల్ పార్లమెంటును రద్దు చేయాలని ఆ దేశ మంత్రి మండలి సిఫారసు చేసింది. నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి నిర్వహించిన అత్యవసర సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనిపై నేపాల్ మంత్రి బార్సామన్ పున్ మీడియాకు వివరించారు. పార్లమెంటును రద్దు చేయాలంటూ మంత్రి మండలి చేసిన సిఫారసును రాష్ట్రపతికి పంపామని తెలిపారు.

ఈ ఏడాది జూన్, జులైలో నేపాల్ అధికార  కమ్యూనిస్టు పార్టీలో సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, పూర్తిగా పార్లమెంటును రద్దు చేయాలంటూ నేపాల్ మంత్రి మండలి తాజాగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనిపై రాష్ట్రపతి నుంచి స్పందన రావాల్సి ఉంది.


More Telugu News