కుమార్తె చావుకు అల్లుడు కారణం కాదు... డ్యాన్సర్ గాయత్రి సూసైడ్ కేసులో తండ్రి కీలక వ్యాఖ్యలు!
- విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న డ్యాన్సర్ గాయత్రి
- స్నేహితురాలు నీలిమ ప్రమేయంపై విచారించండి
- పోలీసులకు గాయత్రి తండ్రి వినతి
విజయవాడ వాంబే కాలనీలో సూసైడ్ చేసుకున్న ఈవెంట్ డ్యాన్సర్ గాయత్రి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా మీడియాతో మాట్లాడిన గాయత్రి తండ్రి, తన బిడ్డ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియదని, అయితే, తన అల్లుడు మాత్రం కారణం కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో గాయత్రి స్నేహితురాలు నీలిమ, ఆమె భర్త ప్రమేయం ఉండవచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.
తన మనవళ్లు వచ్చి చెప్పేంతవరకూ గాయత్రి సూసైడ్ చేసుకుందన్న సంగతి తెలియదని అన్నారు. పోలీసులు సత్వరమే కేసును అన్ని కోణాల్లో విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలావుండగా, గాయత్రి ఆత్మహత్య చేసుకున్న రోజున తాను కలిసిన మాట వాస్తవమేనని ఆమె స్నేహితులాలు నీలిమ అంగీకరించింది. అయితే, తాను చాలా సాధారణంగానే కలిశానని, ఆ తరువాత ఆమె సూసైడ్ ఎందుకు చేసుకుందో పోలీసులు తేల్చాలని కోరింది.
తన భర్తతో గాయత్రికి వివాహేతర బంధం ఉందని, కొంతకాలం క్రితం తన భర్తను వదిలేయాలని తాను కోరగా, ఆమె అంగీకరించిందని చెప్పిన ఆమె, ఆ తరువాత కూడా ఆమె మారలేదని ఆరోపించింది. గాయత్రి గురించి తెలిసిన తరువాత ఆమె భర్త సంతోష్ తీవ్రంగా కొట్టాడని, ఇదే విషయాన్ని ఆమె ఫోన్ లో చెప్పుకుని ఏడ్చిందని తెలిపింది. ఆమె సూసైడ్ వెనుక అసలు కారణాలను పోలీసులు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేసింది.