కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లారీ ఢీ కొని నలుగురు చిన్నారుల మృతి
- కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై ఘటన
- మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
- స్థానికులు 40 మంది కలిసి చర్చికి వెళ్తుండగా ప్రమాదం
లారీ ఢీ కొట్టడంతో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా వారికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున శిరివెళ్ల మండలంలోని ఎర్రగుంట్ల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానికులు 40 మంది కలిసి చర్చికి వెళ్తూ రోడ్డు దాటుతుండగా అదే సమయంలో ఆ రోడ్డుపై ఐషర్ లారీ దూసుకొచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల పేర్లు సురేఖ, ఝాన్సీ, వంశీ, హర్షవర్ధన్ గా పోలీసులు గుర్తించారు.
వారందరి వయసు 12 ఏళ్లలోపే ఉంటుందని చెప్పారు. వారిని ఢీ కొట్టిన తర్వాత లారీ డ్రైవర్ ఆ వాహనాన్ని ఆపకుండా తప్పించుకోవాలని ప్రయత్నించాడు. అయితే, స్థానికులు ఆ లారీని వెంబడించి ఆళ్లగడ్డ సమీపంలోని బత్తులూరు వద్ద పట్టుకున్నారు.