పెళ్లి విందులో రాకుమార్తెలా మెరిసిన మెగా డాటర్.. మనీశ్ మల్హోత్రా బ్రైడల్‌ లెహంగాలో నిహారిక!

  • నిన్న హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో విందు
  • ప్రముఖ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్ర రూపొందించిన బ్రైడల్‌ లెహంగాలో నిహారిక
  • లైట్‌ గ్రీన్‌, గోల్డ్‌ కలర్‌లో ఉన్న ‌ లెహంగా
  • గతంలో ఓ ప్రకటనలో ధరించిన జాన్వీ
సినీనటుడు, నిర్మాత నాగబాబు కుమార్తె నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో ఈ నెల 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి రిసెప్షన్ ను నిన్న హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. దీనికి మెగా కుటుంబ సభ్యులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
  
ఈ విందులో నిహారిక వేసుకున్న దుస్తులు అందరినీ ఆకర్షించాయి. వాటిని ప్రముఖ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్ర రూపొందించారు. లైట్‌ గ్రీన్‌, గోల్డ్‌ కలర్‌లో ఉన్న ఈ బ్రైడల్‌ లెహంగాలో నిహారిక కనపడింది. ఇటువంటి లెహంగానే ఇటీవల శ్రీదేవి కూతురు బాలీవుడ్ నటి జాన్వికపూర్ ధరించింది.  

మనీశ్‌ మల్హోత్ర బ్రైడల్‌ కలెక్షన్‌ ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ ప్రకటన రూపొందించారు. ఆ‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వైరల్ అయ్యాయి. నిహారిక కూడా అదే స్టైల్‌లోని లెహంగాలో కనిపడడంతో నెటిజన్లు జాన్వీ, నిహారికలను పోల్చుతూ ఫొటోలు పెడుతున్నారు.
    
 


More Telugu News