క్రిస్మస్ కన్నా ముందుగానే మనకు టీకా!
- తొలుత 25 నుంచి పంపిణీ చేస్తారని వార్తలు
- అంతకన్నా ముందే రానున్న టీకా
- యూకే నిర్ణయం కోసం వేచిచూస్తున్న అధికారులు
డిసెంబర్ 25న వాజ్ పేయి జయంతి వేడుకల సందర్భంగా ఇండియాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం అవుతుందని వార్తలు రాగా, ఇప్పుడు అంతకన్నా ముందుగానే టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర అధికారి ఒకరు వెల్లడించారు.
దేశ ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ ను అనుమతించే ముందు యూకే, బ్రెజిల్ దేశాల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారి ఆరోగ్య సమాచారాన్ని పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ రెండు దేశాల్లో యూఎస్ కు చెందిన ఫైజర్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ ను సరఫరా చేస్తుండగా, ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనికా సైతం తమ వ్యాక్సిన్ ను అనుమతించాలని దరఖాస్తు చేసుకుంది.
ఇక వ్యాక్సిన్ ఫలితాలను, మోతాదును అంచనా వేస్తున్నామని వెల్లడించిన ఎంహెచ్ఆర్ఏ (మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్స రెగ్యులేటరీ ఏజన్సీ) ఎంహెచ్ఆర్ఏ, బ్రిటన్ లో ఈ టీకాకు అనుమతి లభించగానే, ఇండియాలోనూ పర్మిషన్స్ వస్తాయని, క్రిస్మన్ కు ముందే వ్యాక్సిన్ కు అనుమతి ఇవ్వవచ్చని, ఆ వెంటనే దేశీయంగా టీకా పంపిణీ ప్రారంభం అవుతుందని అన్నారు.
సీరమ్ ఇనిస్టిట్యూట్ నుంచి వచ్చిన అభ్యర్థనను ఆమోదించే ముందు యూకే నియంత్రణా సంస్థల నిర్ణయం కీలకమని వ్యాఖ్యానించిన ఓ ఉన్నతాధికారి, టీకా భద్రత, సమర్థత, శరీరంలో పెరిగే రోగ నిరోధక శక్తిపై ఓ నిర్ణయానికి వచ్చిన తరువాత మాత్రమే, ఇండియాలో పంపిణీ ప్రారంభమవుతుందని, అప్ డేటెడ్ సేఫ్టీ డేటా కోసం తాము వేచి చూస్తున్నామని అన్నారు. అన్ని వివరాలనూ అందించాలని సీరమ్ ను కోరామని, అవి వచ్చిన తరువాతే ఓ నిర్ణయం వెలువడుతుందని స్పష్టం చేశారు.