చట్టం రాకముందే వచ్చినట్టుగా మోసగించిన ఈ ప్రభుత్వాన్ని ఫేక్ అనకూడదా?: వర్ల

  • దిశ చట్టం నేపథ్యంలో వర్ల వ్యాఖ్యలు
  • ప్రభుత్వానివి తప్పటడుగులు అని విమర్శలు
  • ముందే దిశ పోలీస్ స్టేషన్లు నిర్మించి భంగపడ్డారని వెల్లడి
దిశ చట్టం నేపథ్యంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దిశ చట్టం విషయంలో ఈ ప్రభుత్వం మొదటి నుంచి తప్పటడుగులు వేసిందని తెలిపారు. చట్టం అమలులోకి రాకముందే దిశ పోలీస్ స్టేషన్లు నిర్మించి భంగపడిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి దిశ బిల్లును తిప్పి పంపిన నిజం దాచి రాష్ట్ర ప్రజలను మోసగించిందని ఆరోపించారు. చట్టం రాకముందే వచ్చినట్టుగా మోసగించిన ఈ ప్రభుత్వాన్ని ఫేక్ అనకూడదా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు.


More Telugu News