రైతులను ఆదుకోవాలంటూ వరికంకులతో చంద్రబాబు, లోకేశ్ సహా టీడీపీ నేతల నిరసన

  • సచివాలయం సమీపంలో నిరసన 
  • పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్
  • వరి కంకుల్ని పట్టుకుని నిరసన
ఏపీ శాసనసభ, మండలి శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అంతకుముందు  టీడీపీ నేతలు సచివాలయం సమీపంలో నిరసన తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైతుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇందులో పాల్గొన్నారు.
   
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ వరి కంకుల్ని పట్టుకుని, భారీ వర్షాలకు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని కోరారు. పంట కంకులతో కూడిన బ్యానర్లను టీడీపీ నేతలు ప్రదర్శించారు. ఏపీలో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని, ఉద్యాన పంటలకు రూ.50 వేలు, ముంపు బాధితులకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.


More Telugu News