సహనం కోల్పోయిన బీహార్ సీఎం నితీశ్ కుమార్.. తేజస్వి యాదవ్‌పై నిప్పులు
- ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై నమోదైన కేసులపై నిలదీసిన తేజస్వి
- ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడిన ముఖ్యమంత్రి
- నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని ఆయన సభ నుంచి వెళ్లడం బెటర్ అంటూ నిప్పులు
ప్రతిపక్ష నేత తేజస్వియాదవ్‌పై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆగ్రహంతో ఊగిపోయారు. అసెంబ్లీ సాక్షిగా విరుచుకుపడ్డారు. నితీశ్ కుమార్‌పై నమోదైన క్రిమినల్ కేసులపై తేజస్వి యాదవ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని పదేపదే నిలదీశారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన నితీశ్ సహనం కోల్పోయారు. ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. అతడు అబద్ధాలు ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘అతడు నాకు సోదరుడి లాంటి స్నేహితుడి కుమారుడు కావడం వల్లే ఇప్పటి వరకు ఆయన చెప్పినదంతా విన్నాను. తేజస్వి చెప్పినదంతా శుద్ధ అబద్ధం. నేను ఇంతకుమించి ఇంకేమీ మాట్లాడను. తన తండ్రిని లెజిస్లేటివ్ పార్టీ నేతను చేసిందెవరో ఆయనకు తెలుసా? కనీసం ఆయనను డిప్యూటీ సీఎంను చేసిందెవరో తెలుసా? నాపై ఆరోపణలు చేస్తున్న ఆయన మొదట ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. చెప్పలేరు కాబట్టి ఆయన సభ నుంచి వెళ్లడమే మంచిది’’ అని తేజస్విపై విరుచుకుపడ్డారు. తనపై నమోదైన క్రిమినల్ కేసులపై తేజస్వి యాదవ్ ఒకే రోజు రెండుసార్లు లేవనెత్తడంతో ఊగిపోయిన నితిశ్ కుమార్.. తేజస్వికి ఇలా బదులిచ్చారు.