దళిత యువతిని పెళ్లి చేసుకున్నందుకు కొట్టి చంపేశారు!
- ఢిల్లీ శివార్లలోని గురుగావ్ లో దారుణం
- ఐదు నెలల క్రితం దళిత యువతిని పెళ్లాడిన యువకుడు
- కొట్టి చంపేసిన అగ్రవర్ణానికి చెందిన యువకులు
ఢిల్లీ శివారు ప్రాంతమైన గురుగావ్ లో దారుణం చోటు చేసుకుంది. దళిత యువతిని పెళ్లి చేసుకున్నాడనే కారణంతో ఆకాశ్ అనే 28 ఏళ్ల అగ్రకుల యువకుడిని దుండగులు దారుణంగా హతమార్చారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు మాట్లాడుతూ, ఐదు నెలల క్రితం దళిత యువతిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి బెదిరింపులు వస్తున్నాయని చెప్పాడు. గత ఆదివారం భార్య తల్లిదండ్రులతో మాట్లాడేందుకు ఆమెతో పాటు గురుగావ్ లోని బాద్షాపూర్ కు తన సోదరుడు వెళ్లాడని... ఆ సందర్భంగా గ్రామంలో ఆయనపై దాడి చేశారని తెలిపాడు.
ఈ కేసుకు సంబంధించి ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరు రిమాండ్ లో ఉన్నారు. ఆకాశ్ ను హత్య చేసిన ఐదుగురూ దళిత యువతి గ్రామానికి చెందినవారే. వీరు ఐదుగురు అగ్రవర్ణానికి చెందినవారు. ఈ కారణం వల్లనే గ్రామంలోకి రావద్దంటూ అతడిని హెచ్చరించారు. అయినా గ్రామంలోకి రావడంతో కొట్టి, చంపేశారు.