చైనా వ్యాక్సిన్ వికటించిన వైనం.. బ్రెజిల్‌లో ప్రయోగాల నిలిపివేత!
- చివరి దశ ప్రయోగాల్లో ఉన్న చైనా వ్యాక్సిన్ 'కరోనావాక్'
- వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో దుష్ప్రభావాలు
- అతి త్వరగా వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాలే కారణమని విమర్శలు
కరోనాతో వణికిపోతోన్న ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోన్న నేపథ్యంలో ఈ రేసులో చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. చివరి దశలో ఉన్న చైనా వ్యాక్సిన్ 'కరోనావాక్' కు సంబంధించి బ్రెజిల్‌లో జరుగుతున్న ప్రయోగాలు బెడిసికొట్టాయి.
వ్యాక్సిన్ వికటించడంతో ఆ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బ్రెజిల్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో దుష్ప్రభావాలు కనిపించాయని తెలిపింది. ఈ విషయంపై బ్రెజిల్ లోని సినోవాక్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి.
చైనా వ్యాక్సిన్ కోసం చేస్తోన్న ప్రయోగాల్లో ఇలా జరగటం ఇదే మొదటిసారి. వ్యాక్సిన్ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు బ్రెజిల్‌కు చెందిన బయోమెడికల్ పరిశోధనా కేంద్రం బుటాంటన్ ఇన్‌స్టిట్యూట్ గత నెలలో ప్రకటన చేసింది. అయితే, ఇంతలోనే ఆ వ్యాక్సిన్ వికటించడం గమనార్హం. అతి త్వరగా వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాలను చైనా కొనసాగిస్తోంది.
ఎన్నో నియమాలను సడలించి మరీ వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనాతో పాటు పలు దేశాల వ్యాక్సిన్లు వికటిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి వ్యాక్సిన్ల ప్రయోగాలు తుది దశకు చేరుకున్న సమయంలో వికటించిన విషయం తెలిసిందే.