విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన 1.2 మెగావాట్ల విద్యుత్ మోటార్లు
- రూ. 2 కోట్ల మేర ఆస్తి నష్టం
- టర్బైన్‌లో ఆయిల్ లీక్ కావడమే ప్రమాదానికి కారణం!
- మంటలు అదుపు చేయడంతో తప్పిన పెను ప్రమాదం
విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్‌లో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని టర్బైన్‌లో ఆయిల్ లీక్ కావడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. టీపీసీ-2లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో 1.2 మెగావాట్ల విద్యుత్ మోటార్లు కాలిబూడిదయ్యాయి.
ప్రమాదంలో రెండు కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.