ధరణి యాప్ లో వ్యవసాయేతర ఆస్తుల వివరాలు నమోదు చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

  • ఇటీవల ధరణి యాప్, పోర్టల్ ప్రారంభించిన రాష్ట్ర సర్కారు
  • యాప్ భద్రతపై హైకోర్టులో పిటిషన్లు
  • యాప్ భద్రతకు ఏ చర్యలు తీసుకుంటారో తెలపాలన్న హైకోర్టు
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నూతన రెవెన్యూ చట్టం అమలులో భాగంగా ఆస్తుల వివరాల నమోదు కోసం ధరణి యాప్, పోర్టల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ధరణి యాప్ భద్రతపై సందేహాలున్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం.... ధరణి యాప్ లో వ్యవసాయేతర ఆస్తుల వివరాలు నమోదు చేయవద్దని ఆదేశించింది. భద్రతాపరమైన నిబంధనలు పాటించకపోతే ఇబ్బందులు వస్తాయని హైకోర్టు పేర్కొంది.

గూగుల్ ప్లే స్టోర్ లో ధరణి యాప్ ను పోలిన మరో 4 యాప్ లు ఉన్నాయని తెలిపింది. వీటిలో అసలు యాప్ ఏదో తెలుసుకోవడం ఇబ్బందికరమైన అంశం అని న్యాయస్థానం అభిప్రాయపడింది. యాప్ భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలపాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.


More Telugu News