కథానాయకుడిగా అదృష్టం పరీక్షించుకోనున్న రాజీవ్ కనకాల తనయుడు
- రోషన్ కనకాల హీరోగా కొత్త చిత్రం
- పూజా కార్యక్రమాలు జరుపుకున్న చిత్రం
- త్వరలో సెట్స్ పైకి వెళుతుందన్న రాజీవ్ కనకాల
ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ తనయుడు రోషన్ ఇప్పటికే సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చాడు. గతంలో సహాయ నటుడి పాత్ర పోషించిన రోషన్ ఇప్పుడు హీరోగా తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. కొత్త డైరెక్టర్ విజయ్ దర్శకత్వంలో జేబీ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రోషన్ హీరోగా తెరకెక్కుతున్న నూతన చిత్రం ప్రారంభమైంది.
హైదరాబాదులోని ఓ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తన కుమారుడు రోషన్ హీరోగా చేస్తుండడం పట్ల సంతోషంగా ఉందని రాజీవ్ కనకాల ఓ వీడియోలో పేర్కొన్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని, చిత్రబృందాన్ని ఆశీర్వదించాలని సూచించారు.