ఇటువంటి రాజకీయాలు ఎవరూ చేయొద్దు: ప్రధాని మోదీ
- ఉగ్రవాదంతో ఎవ్వరూ ప్రయోజనం పొందలేరు
- పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది
- సైనికుల పక్షాన నిలవకుండా కొందరు పలు వ్యాఖ్యలు చేశారు
- ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో కశ్మీర్‌లో అభివృద్ధి
ఉగ్రవాదంపై భారత్ నిరంతర పోరు సాగిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని నర్మదా నది తీరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద ఆయనకు నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్‌లో పాల్గొని మాట్లాడుతూ... ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ కలిసి పోరాడాలని చెప్పారు.
ఉగ్రవాదంతో ఎవ్వరూ ప్రయోజనం పొందలేరని మోదీ అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమని చెప్పారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి సమయంలో సైనికుల పక్షాన నిలవకుండా కొందరు పలు వ్యాఖ్యలు చేయడం బాధించిందని తెలిపారు.
భారత ప్రయోజనాల కోసమైనా అటువంటి రాజకీయాలు మరోసారి చేయొద్దని మోదీ చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ఆ ప్రాంతం అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలిపారు. అలాగే, ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని పునరుద్ధరిస్తున్నామని, ఆయా రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. కరోనా విజృంభణ సమయంలో పోరాడిన వారిని మోదీ కొనియాడారు.