2 గంటల పాటు ఆపరేషన్ చేసి తెల్ల ఎలుక ప్రాణాలు కాపాడిన వైద్యుడు
- యూపీలోని అలీగఢ్‌లో ఘటన
- ఎలుక కంట్లో 25 గ్రాముల కణతి
- గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లిన యజమాని
ఓ తెల్ల ఎలుక కంట్లో ఉన్న 25 గ్రాముల కణతిని ఆపరేషన్ ద్వారా తొలగించి వైద్యులు దాని ప్రాణాలు కాపాడారు. యూపీలోని అలీగఢ్‌కు చెందిన వెటర్నరీ ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. అమిత్ కుమార్ అనే వ్యక్తికి కొన్ని రోజుల క్రితం తన ఇంటి సమీపంలో ఓ తెల్ల ఎలుక కనిపించింది. దీంతో దాన్ని తన ఇంటికి తీసుకువెళ్లాడు.
అయితే, దానికి ఆహారం పెడితే తినలేకపోయింది. దాని కంట్లో ఏదో సమస్య ఉందని గుర్తించాడు. దీంతో దాన్ని సురేంద్ర నగర్‌లోని వెటర్నరీ డాక్టర్ విరామ్ వైష్నోయ్ దగ్గరకు తీసుకువెళ్లగా, దానిని వైద్యుడు పరిశీలించి దాని కంట్లో కణతి ఉందని గుర్తించి, రెండు గంటలపాటు ఆపరేషన్ చేసి, ఆ కణతిని తొలగించాడు. గంట సేపటి తరువాత ఆ ఎలుక కోలుకుంది. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఆ ఎలుకను అమిత్ మళ్లీ పెంచుకుంటున్నాడు.