ఆనాటి మా నాన్న ప్రశ్నకు సమాధానమే... నేటి మా జియో: ముకేశ్ అంబానీ
- పోస్టుకార్డు ఖర్చుతో మాట్లాడుకోవచ్చా?
- ఒకనాడు మాటల సందర్భంగా ధీరూభాయ్ అడిగారు
- ఆ కల ఇప్పుడు నిజమైందన్న ముకేశ్
ఒకనాడు మాటల సందర్భంగా తన తండ్రి ధీరూభాయ్ అంబానీ అడిగిన ప్రశ్నకు సమాధానమే నేటి జియో విప్లవమని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. ఎన్కే సింగ్ రచించిన 'పోట్రేయిట్స్ ఆఫ్ పవర్' అనే పుస్తకావిష్కరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "పోస్ట్ కార్డుకు అయ్యేంత ఖర్చుతో ఇండియాలోని ప్రజలంతా ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం వస్తుందా?" అని తన తండ్రి తనను ప్రశ్నించారని, దానికి సమాధానాన్ని తాను ఇప్పుడు చెప్పగలనని అన్నారు. జియోతో టెలికం విప్లవం మరో మెట్టు ఎక్కిందని చెప్పారు.
ఇండియాను ఆత్మనిర్భర్ భారత్ గా మార్చాలంటే, మాన్యుఫాక్చరింగ్ రంగానికి మరింత ప్రోత్సాహకాలు అవసరమని అంబానీ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ విభాగంలో ఎన్నో స్టార్టప్ కంపెనీలు పుట్టుకుని వస్తున్నాయని, వాటికి లభిస్తున్న మద్దతు, ఇప్పటికే నిలదొక్కుకున్న చిన్న, మధ్య తరహా కంపెనీలకు దక్కడం లేదని అన్నారు. స్టార్టప్ లకు లభిస్తున్న ప్రోత్సాహకాలు ఎస్ఎంఈలకు దక్కాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రభుత్వాలు 'క్లిక్' (కంప్యూటర్ కీ బోర్డుపై క్లిక్ లు)ల కంటే 'బ్రిక్' (ఆర్థిక వ్యవస్థను నిలిపే ఇటుకలు - ఎస్ఎంఈలు)లపై మరింత దృష్టిని సారించాలని చమత్కరించారు.