తెలంగాణలో గణనీయంగా తగ్గిన కొత్త కేసులు
- నిన్న రాష్ట్రవ్యాప్తంగా 948 కేసుల నమోదు
- 2,23,059కి పెరిగిన మొత్తం కేసుల సంఖ్య
- రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 21,098
తెలంగాణలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తోంది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 948 కేసులు మాత్రమే వెలుగుచూశాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో నమోదైన 212 కేసులు ఉన్నాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కొద్దిసేపటి క్రితం బులెటిన్ విడుదల చేసింది.
తాజా కేసులతో కలుపుకుని ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,23,059కి పెరిగింది. మహమ్మారి కారణంగా నిన్న నలుగురు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,275కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 21,091 కేసులు యాక్టివ్గా ఉండగా, వీరిలో 17,432 మంది హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. నిన్న 1,896 మంది కరోనా కోరల నుంచి బయటపడడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,00,686కు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు.