విశాఖ భూ దోపిడీ వెనకున్న వారి ఆటలు కట్టిస్తాం: బొత్స
- ‘సిట్’పై జగన్‌తో చర్చించా
- మూడు రాజధానులకే ప్రజల మద్దతు
- చంద్రబాబు పిలుపుకు ఎవరూ స్పందించలేదు
విశాఖపట్టణంలో జరిగిన భూ దోపిడీని వెలికి తీస్తామని, ఇందుకోసం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
నిన్న విశాఖలోని వైసీపీ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. విశాఖ భూముల సిట్ విషయమై ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డితో చర్చించినట్టు చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ దోపిడీ జరిగిందని, దీని వెనకున్నవారి ఆటలు కట్టిస్తామని హెచ్చరించారు. అమరావతి ఉద్యమంపై మంత్రి మాట్లాడుతూ.. అమరావతికి మద్దతుగా చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపునకు ఎవరూ స్పందించలేదని, మూడు రాజధానులకు రాష్ట్ర ప్రజల మద్దతు ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేంటని ప్రశ్నించారు.