నాన్న ధోనీ గురించి జీవా పెట్టిన వీడియో వైరల్!

  • పప్పాకు పెద్ద ఫ్యాన్ ను
  • ధోనీ స్కెచ్ పట్టుకుని జీవా వీడియో
  • షేర్ చేసిన ధోనీ, సాక్షి
తన తండ్రికి తాను పెద్ద ఫ్యాన్ నని చెబుతూ, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు నాయకత్వం వహిస్తున్న ధోనీ గురించి, ఆయన కుమార్తె జీవా పెట్టిన వీడియో వైరల్ అయింది. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ధోనీ స్కెచ్ ని పట్టుకున్న జీవా, "నేను పప్పాకు పెద్ద ఫ్యాన్ ను" అని వ్యాఖ్యానించింది.

ఇది నిమిషాల వ్యవధిలోనే వైరల్ కావడంతో, ధోనీ, సాక్షి కూడా ఆ వీడియోను షేర్ చేసి ఆనందించారు. ధోనీ, సాక్షీలు జూలై 4, 2010న వివాహం చేసుకోగా, 2015, ఫిబ్రవరి 6న ఈ జంటకు జీవా జన్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐదేళ్ల వయసులో ఉన్నప్పటికీ, ఓ స్టార్ కిడ్ గా ఉన్న జీవా సోషల్ మీడియా ఖాతాలను లక్షల మంది ఫాలో అవుతున్నారు.


More Telugu News