తన ఇల్లు, కార్యాలయంపై సీబీఐ దాడులు అంటూ ప్రచారం జరుగుతుండడంపై రఘురామకృష్ణరాజు స్పందన

  • ఎక్కడా సోదాలు లేవన్న నరసాపురం ఎంపీ
  • మీడియాలో చూసే తెలుసుకున్నానని వెల్లడి
  • ఏ అధికారులూ రాలేదని స్పష్టీకరణ
తన నివాసం, కార్యాలయాలపై సీబీఐ దాడులు అంటూ ప్రచారం జరుగుతోందంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. తన ఇంట్లో ఎలాంటి సోదాలు జరగడంలేదని స్పష్టం చేశారు. సోదాలు అన్న వార్త మీడియా ద్వారానే తెలుసుకున్నానని పేర్కొన్నారు. ఢిల్లీలో కానీ, హైదరాబాద్ లో కానీ, తన నియోజకవర్గంలో కానీ ఎక్కడా తన నివాసాలపైనా, తన కార్యాలయాలపైనా సీబీఐ దాడులు జరగలేదని వివరణ ఇచ్చారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని తమకు ఎవరూ ఇంతవరకు ఇవ్వలేదని తెలిపారు.

"నా ఇంటికి, నా ఆఫీసుకు ఏ అధికారులు రాలేదు. ఎక్కడా సోదాలు జరగలేదు.నేను కూడా మీడియాలో చూసే ఈ విషయం తెలుసుకున్నా.  మీడియాలో చూపిస్తున్న ఇళ్లు ఎవరివో, ఎక్కడివో మరి!" అంటూ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.


More Telugu News