అపెక్స్ కౌన్సిల్ భేటీ నేపథ్యంలో.. తన డిమాండ్ గుర్తు చేసిన రేవంత్ రెడ్డి!
- అక్టోబరు 6న అపెక్స్ కౌన్సిల్ భేటీ
- నారాయణ పేట్-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌పై చర్చించాలి
- దీన్ని అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో కలపాలి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఈ నెల 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదాపడ్డ ఈ సమావేశాన్ని ఈ నెల 6న నిర్వహిస్తామని ఇప్పటికే కేంద్ర జల్ శక్తి మత్రిత్వశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా దీనిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తన డిమాండ్‌ను మరోసారి గుర్తు చేశారు. ఈ సమావేశంలో భాగంగా నారాయణ పేట్-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని కూడా అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో కలపాలని ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని డిమాండ్ చేశారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, తెలంగాణ సీఎంవో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారత ప్రధాని కార్యాలయానికి ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.