ఆయన పేరు గుర్తుకు రాగానే అందరి పెదాలపై చిరునవ్వు మెదులుతుంది: చిరంజీవి

  • నేడు అల్లు రామలింగయ్య జయంతి
  • ట్విట్టర్ లో స్పందించిన చిరంజీవి
  • మావయ్య గారు హోమియోపతి డాక్టర్ కూడా అంటూ వ్యాఖ్యలు
తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ హాస్యనటుల్లో అల్లు రామలింగయ్యది ప్రత్యేక స్థానం. ఇవాళ అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా ఆయన అల్లుడు, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు. ఆయన పేరు గుర్తుకురాగానే అందరి పెదాలపై చిరునవ్వు మెదులుతుందని తెలిపారు.

"మావయ్య గారు అందరినీ మెప్పించిన నటుడే కాదు... తియ్యని గుళికలతో వైద్యం చేసే హోమియోపతి వైద్యుడు కూడా. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు, తత్వవేత్త, నాకు మార్గదర్శి, గురువు. అన్నింటికి మించి మనసున్న మనిషి. ఈ 99వ పుట్టినరోజు సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ... వచ్చే ఏడాది ఆయన శతజయంతి వేడుక ఆయన జీవితాన్ని, జీవన విధానాన్ని ఆవిష్కరిస్తుందని ఆశిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.


More Telugu News