హీరోయిన్లు సంజన, రాగిణిల బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన కోర్టు

  • కన్నడ సినీ పరిశ్రమను వణికిస్తున్న డ్రగ్స్ అంశం
  • బుల్లి తెరను కూడా తాకిన డ్రగ్స్ భూతం
  • వెలుగులోకి వస్తున్న కొత్తకొత్త పేర్లు
సినీ హీరోయిన్లు సంజన, రాగిణి ద్వివేదిలకు బెంగళూరులోని ఓ కోర్టు షాక్ ఇచ్చింది. డ్రగ్స్ కేసులో వీరిద్దరూ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరు వేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. మరోవైపు కర్ణాటకలో డ్రగ్స్ వ్యవహారం కన్నడ సినీ పరిశ్రమనే కాకుండా... బుల్లితెరను కూడా తాకింది. కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీని మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి, విచారించారు. సీసీబీ పోలీసుల విచారణలో కొత్తకొత్త పేర్లు వెలుగులోకి వస్తుండటంతో... కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర ఆందోళన నెలకొంది.


More Telugu News