భూమికి ఓ బుల్లి చంద్రుడు... చుట్టూ తిరుగుతున్న వీడియోలు విడుదల!
- కక్షలోకి వచ్చిన బూస్టర్ రాకెట్ శకలం
- భూమి చుట్టూ తిరుగుతుండటంతో గుర్తించిన శాస్త్రవేత్తలు
- 60వ దశకంలో ప్రయోగించారని వెల్లడి
భూమికి ఉపగ్రహంగా చంద్రుడు ఉన్నాడని, చంద్రుడు నిరంతరం భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, భూమికి ఓ బుల్లి చంద్రుడు వచ్చి చేరాడు. 1960 దశకంలో ప్రయోగించిన ఓ బూస్టర్ రాకెట్, భూమి కక్షలోకి వచ్చి, తిరుగుతుంటే శాస్త్రవేత్తలు వీడియో తీశారు.ఈ బుల్లి చంద్రుడు ఓ ఆవు లేదా హిప్పో పొటామస్ అంత సైజ్ లో ఉండవచ్చని, దీనికి '2020 సీడీ3' అని పేరు పెట్టామని, ఈ బుల్లి చంద్రుడు తాత్కాలికమేనని వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రొనామికల్ యూనియన్ నిర్వహణలోని మినార్ ప్లానెట్ సెంటర్ ఈ బుల్లి చంద్రుడిగా కనిపిస్తున్న బూస్టర్ రాకెట్ అవశేషాన్ని విడుదల చేసింది.
తాము కనుగొన్న ఈ విషయం చాలా పెద్దదని, అంతరిక్ష పరిశోధకుడు క్యాస్పర్ విర్జ్ చోస్ వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో మినీ మూన్ ఫోటోలను పెట్టారు. దీన్ని తొలిసారిగా ఫిబ్రవరి15న గుర్తించామని ఆయన తెలిపారు. ఈ విశ్వంలో లక్షల ఆస్ట్రాయిడ్స్ తిరుగుతుంటాయని, ఎర్త్ ఆర్బిట్ లోకి వచ్చిన రెండో ఆస్ట్రాయిడ్ ఇదని ఆయనఅన్నారు.