రేపు తిరుమలకు వెళ్లనున్న జగన్.. రాత్రికి కొండపైనే బస!
- రేపు సాయంత్రం 5 గంటలకు తిరుమల చేరుకోనున్న జగన్
- 6.30 గంటలకు శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ
- తిరుమలకు వస్తున్న కర్ణాటక సీఎం యడియూరప్ప
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు తిరుమలకు వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఆయన తిరుమలకు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అనంతరం రాత్రి కొండపైనే బస చేస్తారు. 24వ తేదీ ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు.
అనంతరం 7 గంటలకు ఆలయం వెలుపల ఉన్న నాదనీరాజన మండపం వద్ద జరిగే సుందరకాండ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి జగన్ తో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా హాజరుకానున్నారు. అనంతరం 8 గంటలకు యడియూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు.
సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, సీవీఎస్ఓ గోపినాథ్ జెట్టి దగ్గరుండి పరిశీలిస్తున్నారు. భద్రత ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు.