అనురాగ్‌ కశ్యప్‌ నన్ను బలవంతం చేయబోయాడు: నటి పాయల్ ఘోష్

  • అనురాగ్ కశ్యప్ ఫోన్ చేస్తే వెళ్లి కలిశాను
  • హీరోయిన్లు తనకు ఫోన్ కాల్ దూరంలో ఉంటాడని చెప్పాడు
  • శారీరక సంబంధం సమస్య కాదన్నట్టు మాట్లాడాడు
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ తనను ఇబ్బంది పెట్టిన దర్శకుడు అనురాగ్ కశ్యప్ అని ఆరోపించింది. స్త్రీ స్వేచ్ఛ గురించి ఆయన మాట్లాడుతున్న మాటలను చూస్తే నవ్వొస్తోందని చెప్పింది.

ఒక రోజు ఆయన ఫోన్ చేస్తే వెళ్లి కలిశానని... ఆ సమయంలో ఆయన మందు తాగుతున్నాడని... గంజాయిలాంటి పదార్థాన్ని కూడా తీసుకుని ఉంటాడనుకుంటానని చెప్పింది. రణబీర్ కపూర్ సినిమాలో కనీసం ఒక సీన్ లో అయినా నటించాలనుకునే అమ్మాయిలు తనతో పడుకోవాలనుకుంటారని చెప్పాడని తెలిపింది. అమితాబ్, కరణ్ జొహార్ తనతో మాట్లాడుతుంటారని చెప్పాడని వెల్లడించింది.

ఇండస్ట్రీలో శారీరక సంబంధం కలిగి ఉండటం పెద్ద సమస్య కాదన్నట్టు మాట్లాడారని పాయల్ చెప్పింది. రిచా చద్దా, మహిగిల్, హ్యుమా ఖురేషి వంటి హీరోయిన్లు తనకు ఫోన్ కాల్ దూరంలో ఉంటారని అన్నాడని తెలిపింది. తాను కూడా ఏం చేయమంటే అది చేస్తానని అనుకున్నాడని... బలవంతం చేయబోయాడని చెప్పింది. అయితే, తర్వాత కలుస్తానని చెప్పి తాను తప్పించుకున్నానని తెలిపింది. ఈ విషయాన్ని బయటపెడదామని అనుకున్నా ఇతరులు భయపెట్టడంతో చెప్పలేకపోయానని వెల్లడించింది. అవకాశాల కోసం డైరెక్టర్ ని ఒక అమ్మాయి కలిసినంత మాత్రాన ఆమె వేశ్య కాదని చెప్పింది. 


More Telugu News