దుబ్బాక ఉప ఎన్నిక.. సోలిపేట రామలింగారెడ్డి భార్యకే టీఆర్ఎస్ టికెట్?

  • దుబ్బాక టికెట్‌ను ఆశిస్తున్న చెరుకు శ్రీనివాస్‌రెడ్డి
  • తన కుమారుడికి ఇవ్వాలంటున్న రామలింగారెడ్డి భార్య సుజాత
  • సుజాతకే ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయం!
దుబ్బాక శాసన సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన స్థానానికి జరిగే ఉప ఎన్నికలో పోటీకి దింపే అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రామలింగారెడ్డి భార్య సుజాతను బరిలోకి దింపేందుకు దాదాపు నిర్ణయించినట్టు సమాచారం. ఈ విషయంలో అధికారికంగా ఎటువంటి నిర్ణయమూ వెలువడనప్పటికీ సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

నిజానికి దుబ్బాక నుంచి బరిలోకి దిగేందుకు రామలింగారెడ్డి కుటుంబంతోపాటు మాజీ మంత్రి ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కూడా సీటును ఆశిస్తున్నారు. మరోవైపు, దుబ్బాక టికెట్‌ను తన కుమారుడు సతీశ్‌రెడ్డికి ఇవ్వాలని రామలింగారెడ్డి భార్య కోరుతున్నారు. అయితే, అధినాయకత్వం మాత్రం సుజాతవైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. త్వరలోనే సుజాత పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.


More Telugu News