విశాఖ ఫిషింగ్ హార్బర్ లో సుడిగాలి దుమారం... వీడియో ఇదిగో!
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- తీరం వెంబడి బలమైన గాలులు
- సముద్ర ఉపరితలంపై టోర్నడో
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో టోర్నడో సంభవించింది. సముద్ర ఉపరితలంపై విపరీతమైన వేగంతో గాలి సుడులు తిరుగుతూ స్థానికులను ఆందోళనకు గురిచేసింది. గాలితో పాటు నీరు కూడా వేగంగా సుడి తిరుగుతూ తీరం వైపుగా రావడంతో అక్కడే ఉన్న మత్స్యకారులు తమ బోట్లను వదిలేసి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా అమెరికాలో టోర్నడోలు అధిక సంఖ్యలో సంభవిస్తుంటాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనూ టోర్నడోలు తరచుగా దర్శనమిస్తున్నాయి.