మాణిక్యం ఠాగూర్ నియామకంతో తెలంగాణ కాంగ్రెస్ బలోపేతమవుతుంది: పొన్నం ప్రభాకర్

  • జాతీయస్థాయిలో కాంగ్రెస్ ప్రక్షాళన
  • తెలంగాణ ఇన్చార్జిగా కుంతియా తొలగింపు
  • కొత్త ఇన్చార్జిగా మాణిక్యం ఠాగూర్ నియామకం
కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అధినేత్రి సోనియా గాంధీ కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. వీటిలో రాష్ట్రాల ఇన్చార్జిలను మార్చడం ముఖ్యమైన నిర్ణయం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా కుంతియాను తొలగించి ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన మాణిక్యం ఠాగూర్ ను కొత్త ఇన్చార్జిగా నియమించారు. ఈ నియామకంపై తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందించారు. మాణిక్యం ఠాగూర్ నియామకంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

మాణిక్యం ఠాగూర్ నియామకం తెలంగాణ కాంగ్రెస్ కు ఎంతో లాభిస్తుందని, రాష్ట్రంలో పార్టీ బలపేతమవుతుందని అన్నారు. ఠాగూర్ కు విద్యార్థి విభాగం, యూత్ కాంగ్రెస్ విభాగాల్లో సంస్థాగతంగా పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు. కాగా, ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జిగా వ్యవహరించిన కుంతియాకు ఉన్న పదవి పోవడమే కాదు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ కమిటీలోనూ స్థానం దక్కలేదు.


More Telugu News