బిగ్ బాస్ ను జరగనివ్వబోను... కమలహాసన్ కు నటి మీరా మిథున్ వార్నింగ్!
- కోర్టుకు వెళ్లి స్టే తెస్తా
- నా వీడియో కమల్ వద్ద ఉంది
- అవకాశాలు రాకుండా చేస్తున్నారన్న మీరా
ఈ సంవత్సరం కోలీవుడ్ అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ ను అడ్డుకుని తీరుతానని, కోర్టుకు వెళ్లి, స్టే తీసుకుని అయినా వస్తానని నటి మీరా మిథున్ హెచ్చరించి కలకలం రేపింది. ఈ సీజన్ బిగ్ బాస్ షోను కమల్ ఎంత అనుకున్నా సక్రమంగా జరపలేరని సవాల్ విసిరింది. తనకు సంబంధించిన ఓ వీడియోను కమల్ తన వద్ద దాచి పెట్టుకున్నారని, దాన్ని చూపిస్తూ, తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని ఆరోపించింది.
కాగా, మీరా మిథున్ తమిళ బిగ్ బాస్ సీజన్-3లో పాల్గొని ఎక్కడా లేని వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందన్న సంగతి తెలిసిందే. ఆ షోలో మరో కంటెస్టెంట్ గా ఉన్న దర్శకుడు చేరన్, తన నడుమును గట్టిగా పట్టేసుకుని గిల్లాడని సంచలన ఆరోపణలు చేయగా, ఆ వారాంతంలో కమలహాసన్, మీరా మిథున్ అబద్ధాలు చెబుతున్నదంటూ అసలు వీడియోను కమల్ ప్రేక్షకులకు చూపగా కంగుతిన్న ఆమె, అప్పటి నుంచి కమల్ పై తన ఆగ్రహాన్ని వీలు చిక్కినప్పుడల్లా ప్రదర్శిస్తూనే ఉంది.
అంతేకాదు, ఆ మధ్య త్రిష తన మేకప్ టెక్నిక్స్ ను కాపీ కొడుతోందని ఆరోపించడంతో పాటు తమిళ స్టార్ హీరోలు విజయ్, సూర్య ఫ్యాన్స్ ను తనదైన శైలిలో రెచ్చగొట్టి కావాల్సినంత పాప్యులారిటీని సంపాదించింది. ఇక తాజాగా, మీరా మిథున్ రెచ్చగొట్టేలా మాట్లాడినా, అటు కమల్ గానీ,ఇటు బిగ్ బాస్ నాలుగో సీజన్ ను ప్రసారం చేయబోతున్న విజయ్ టీవీ నిర్వాహకులు గానీ పెద్దగా పట్టించుకోలేదు.