ప్రాణాలతో వున్న శిశువును మ‌ట్టిలో పాతిపెట్టి వెళ్లిన తల్లి

  • తూర్పు గోదావరి జిల్లాలో ఘ‌ట‌న‌
  • బ‌య‌ట‌కు తీసి ర‌క్షించిన స్థానికులు
  • త‌ల్లికోసం పోలీసుల గాలింపు
తన పిల్ల‌ల‌కు చిన్న దెబ్బ త‌గిలినా తల్లి త‌ల్ల‌డిల్లిపోతుంది‌. అయితే, అమ్మ‌త‌నానికే మ‌చ్చ‌తెచ్చే ప‌ని చేసింది ఓ త‌ల్లి. అప్పుడే పుట్టిన ఓ మ‌గ శిశువును గుంత‌తీసి పూడ్చిపెట్టింది. తూర్పు గోదావరి జిల్లా, ఎటపాక మండలంలోని కృష్ణవరంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఈ విష‌యాన్ని స్థానికులు వెంట‌నే గుర్తించ‌డంతో ఆ శిశువు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. శిశువును గ్రామస్థులు బయటకు తీసి, పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఆ శిశువు క్షేమంగా ఉన్నాడని చెప్పారు. త‌ల్లి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.


More Telugu News