సులభతర వాణిజ్యంలో ఏపీ నం.1.. మూడో స్థానంలో తెలంగాణ
- వ్యాపార సంస్కరణల కార్యాచరణ ర్యాంకుల ప్రకటన
- ఇంతకు ముందు ఏడాది రెండో స్థానంలో తెలంగాణ
- ఏపీ టాప్ లో నిలవడానికి చంద్రబాబే కారణమన్న లోకేశ్
రాష్ట్రాల వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక -2019 ర్యాంకులను ఈ రోజు కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. సులభతర వాణిజ్యం విభాగంలో ఏపీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకొంది. ఇంతకు ముందు ఏడాది రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ ఈ సారి మాత్రం ఒక స్థానం దిగజారింది. ఏపీ తర్వాత ఈ సారి రెండో స్థానంలో ఉత్తర ప్రదేశ్ నిలిచింది. తెలంగాణ ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి.
కాగా, ఈ జాబితాలో అగ్రస్థానంలో ఏపీ నిలవడానికి తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. "ఇది చంద్రబాబు గారి కష్టపడి పనిచేసేతత్వానికి ఓ నిదర్శనం. సులభతర వాణిజ్య విధానంలో ఏపీ 2018-19లో మరోసారి టాప్ లో నిలిచింది. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికను సమర్థంగా అమలు చేసేందుకు ధన్యవాదాలు. చంద్రబాబులా వైఎస్ జగన్ కూడా ఏపీలో మంచి పనులను చేయాల్సింది.. కానీ చేయకపోవడం విచారకరం" అని లోకేశ్ చెప్పుకొచ్చారు.