ఏపీలో ఉద్ధృతంగా కరోనా వ్యాప్తి... గడచిన 24 గంటల్లో 10,776 కొత్త కేసులు

  • గత 24 గంటల్లో 76 మంది మృతి
  • కొత్తగా 10,776 మందికి కరోనా పాజిటివ్
  • 12,334 మందికి కరోనా నయం
భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలయ్యాక అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. ఇటీవల రాష్ట్రంలో ఈ ప్రమాదకర వైరస్ ఉద్ధృతి మరింత తీవ్రంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గత కొన్నిరోజులుగా నిత్యం పది వేలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. గడచిన 24 గంటల్లోనూ అదే ట్రెండ్ నమోదైంది. కొత్తగా 10,776 పాజిటివ్ కేసులు వచ్చాయి. అదే సమయంలో 76 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,76,506కి చేరగా, మరణాల సంఖ్య 4,276కి పెరిగింది.

తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,405 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ వెయ్యికి పైగా కొత్త కేసులు గుర్తించారు. తాజాగా 12,334 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ మహమ్మారి నుంచి విముక్తులైన వారి సంఖ్య 3,70,163గా నమోదైంది. ఇంకా 1,02,067 మంది చికిత్స పొందుతున్నారు.


More Telugu News