ఈ నెల 18న విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం!

  • నిర్మాణం పూర్తిచేసుకున్న కనకదుర్గ ఫ్లైఓవర్
  • ఇటీవల ప్రారంభోత్సవం వాయిదా
  • తాజా ప్రారంభోత్సవం వివరాలను వెల్లడించిన కేశినేని నాని
విజయవాడ ప్రజలు ఎప్పటినుంచో కోరుకుంటున్న కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఇటీవల వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 4న ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల చేతులమీదుగా ఈ భారీ ఫ్లైఓవర్ ఓపెనింగ్ జరుపుకోవాల్సి ఉన్నా, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించిన నేపథ్యంలో ఆ కార్యక్రమం వాయిదాపడింది. అయితే, కనకదుర్గ ఫ్లైఓవర్ ను ఈ నెల 18న ప్రారంభించనున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని వెల్లడించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వస్తున్నారని నాని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.


.


More Telugu News