ఇది భయానకం... మచ్చా ధనలక్ష్మి అనే దళిత మహిళ ఇల్లు తగలబెట్టేశారు: చంద్రబాబు
- కృష్ణా జిల్లా ముదినేపల్లిలో ఘటన
- కొద్దిలో ప్రాణాపాయం తప్పిందన్న చంద్రబాబు
- అధికార పక్ష సభ్యుల అహంకారం అంటూ వ్యాఖ్యలు
రాష్ట్రంలో దళితులపై దాడులు ఆగడంలేదంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ముదినేపల్లిలో మచ్చా ధనలక్ష్మి అనే దళిత మహిళకు చెందిన ఇంటిని వైసీపీ వర్గీయులు తగలబెట్టేశారని తెలిపారు. వైసీపీ వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇది భయానకమైన ఘటన అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ధనలక్ష్మి కుటుంబ సభ్యులు కొద్దిలో ప్రాణాలు కాపాడుకున్నారని పేర్కొన్నారు. అయితే దురదృష్టవశాత్తు వారి వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయని విచారం వ్యక్తం చేశారు. గత 15 నెలలుగా ఏపీలో దళితులపై దాడులు ఉద్ధృతంగా జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని, అధికార పక్ష సభ్యుల అడ్డూఅదుపులేని అహంకారం కారణంగానే ఈ దాడులు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు.